ఉస్మానియాపై పిల్స్ ను ఒకేసారి విచారిస్తాం

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్ ను కూల్చొద్దని కొందరు, శిథిలమైన ఆ బిల్డింగ్ ను కూల్చేసి మళ్లీ కట్టాలని ఇంకొందరు.. ఇలా పరస్పరం విరుద్ధం గా ఫైల్ అయిన పిల్స్ అన్నింటిపై ఒకేసారి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఈ లోగా కౌంటర్లు ఫైల్ చేయాలని చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌‌సేన్‌ రెడ్డి ల డివిజన్‌ బెంచ్‌‌ మంగళవారం ఆదేశించింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఉస్మానియా బిల్డింగ్ కూలిపోయే దశలో ఉందని, దాని స్థానంలో కొత్తది నిర్మించాలని హైదరాబాద్‌‌లోని సరూర్న గర్‌కు చెందిన హెల్త్‌‌ కేర్‌ రీఫామ్స్‌ డాక్టర్స్ ‌అసోసియేషన్‌ ప్రతినిధి డాక్టర్ కె.మహేశ్ కుమార్‌ పిల్‌‌వేశారు. ఉస్మానియా హాస్పిటల్ ను మళ్లీకట్టేందుకు రూ.200 కోట్లుమంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు కేవలం రూ.6 కోట్లేవిడుదల చేసిందని పేర్కొంటూ సీనియర్‌ సిటిజన్స్‌ఎన్వో జీ మరో పిల్ ఫైల్ చేసింది. ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ ను కూల్చొద్దని, ప్రభుత్వచర్యలను అడ్డుకోవాలని కూడా కొన్ని పిల్స్ దాఖలయ్యాయి.

Latest Updates