హైకోర్టు ఫైర్ : నీలోఫర్ ఆస్పత్రిలో అక్రమాలు కనబడట్లేదా?

  • నిలోఫర్‌ డైట్‌ కాంట్రాక్టర్‌పై ఎందుకంత ప్రేమ
  • సర్కారు, అధికారులపై హైకోర్టు ఫైర్

హైదరాబాద్, వెలుగు: ‘‘నిలోఫర్‌ ఆస్పత్రిలో భోజన సరఫరా పేరుతో నిధులు దారి మళ్లుతుంటే కనబడలేదా..మీకేమయినా కళ్లులేవా౦.. నిధుల స్వాహాను చూడనట్లుగా నటిస్తున్నారా .. ’’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని , ఆస్పత్రి ఉన్నతాధికారులపై మండిపడింది. డైట్‌ కాంట్రాక్టర్‌ కోడూరు సురేష్‌ బాబుపై రెండు కమిటీల రిపోర్టులు వచ్చినా సర్కార్‌ చర్యలు తీసుకోకుండా ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నిం చింది. నిధుల స్వాహా జరిగినా చర్యలు తీసుకోలేదంటే ఏమనుకోవాలని నిలదీసింది. లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతుంటే చర్యలు లేవంటే అందరూ కాంట్రాకర్లతో చేతులు కలిపారన్నఅనుమానాలు వస్తున్నాయంది. కాంట్రాక్టర్‌ కోడూరి సురేష్‌బాబు డైట్‌ సరఫరాలో అక్రమాలకు పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని, కాంట్రాక్టర్ ‌ను తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ డాక్టర్‌ పి.భగవంతరావు దాఖలు చేసిన పిల్‌ను గురువారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మరోసారి విచారణ జరిపింది.

రెండురిపోర్టు లు ఎందుకు?

రెండు కమిటీ రిపోర్టులు ఉన్నాయని ప్రభుత్వం కౌంటర్‌లో చెప్పిందేగానీ ఆ కమిటీ రిపోర్టుల్లో ఏముందో , చెప్పలేదని తప్పుపట్టిం ది. అరకొర సమాచారాన్ని ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలాగని ప్రశ్నించింది. గత ఏడాది తొలి కమిటి రిపోర్టు ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారని, రెం డో కమిటీ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా ప్రశ్నించింది.

చర్యలెందుకు తీసుకోలే..

ప్రభుత్వన్యాయవాది రాధీవ్ రెడ్డివాదనలు వినిపిస్తూ, కాంట్రాక్టర్ ను తొలగించామని, కొత్తకాంట్రాక్టర్ ను నియమించామన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కొత్త కాంట్రాక్టర్‌ నియామకం సరే, పాత కాంట్రాకర్్ట‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. కాంట్రాక్టర్‌ తరఫు లాయర్‌ వాదిస్తూ, పిటిషనర్‌కే గాంధీ ఆస్పత్రి క్యాటరింగ్‌ కాంట్రాక్టు వచ్చిందని, దీంతో కాంట్రాక్టు ఆశించి భంగపడ్డ ఇతరులు కావాలని కేసులు వేస్తున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌ పనితీరును ప్రభుత్వం పరిశీలించాలని ఆదేశించింది, నిధుల స్వాహా ఆరోపణలపై రెండు కమిటీ రిపోర్టులపై తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే ఆగస్టు17లోగా తీసుకున్నచర్యలను వివరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Latest Updates