కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాల్సిందే : హైకోర్ట్

ఆర్టీసీ సమ్మెపై  హైకోర్ట్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని నెరవేర్చదగినవేనన్న కోర్ట్ ..శనివారం ఉదయం 10: 30కి ఆర్టీసీ యాజమాన్యం..కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఆర్టీసీ శాశ్వత ఎండీని నియమిస్తే సగం సమస్యను పరిష్కరించినట్టేనని తెలిపింది. హైకోర్ట్ భయటే సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించింది. శనివారం ఉదయం నుంచి అక్టోబర్ 28వ తేదీ లోగా ఆర్టీసీ సంఘాలతో చర్చించి స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసింది. చర్చల్లో ఆర్టీసీ కొత్తబస్సులు, కార్మికుల డ్రెస్ కోడ్ , ఆరోగ్యం, వారి పిల్లల చదువులు తదితర అంశాలపై చర్చించి 28న నివేదిక ఇవ్వాలని హైకోర్ట్ సూచించింది.

Latest Updates