ఆర్టీసీ సమ్మెపై హైకోర్ట్ ప్రపోజల్ ను తిరస్కరించిన ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మె పై  హైకోర్ట్ ప్రపోజల్ ను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ఆర్టీసీ కార్మికుల సమస్య మళ్లీ మొదటికే వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

RTC సమ్మెపై హైకోర్ట్ లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఏ చిన్న అవకాశం ఉన్నా.. సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదంటే తామే.. సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తులతో హైపవర్ కమిటీ వేస్తామని చెప్పింది. దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని సర్కారుకు సూచించింది. హైకోర్ట్ వేసే కమిటీని స్వాగతిస్తామన్నారు జేఏసీ నేతలు.

హైకోర్ట్ ఆదేశాలతో స్పందించిన ప్రభుత్వం ..హైపవర్ కమిటీకి ఒప్పుకోలేదు. సమ్మెపై చట్టప్రకారం లేబర్ కమీషన్ కు ఆదేశాలివ్వాలని ప్రరభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సమ్మె విషయం లేబర్ కోర్ట్ లో ఉందని వివరించింది. కమిటీ వేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి కాసేపట్లో జరిగే హైకోర్ట్ విచారణపై పడింది.

Latest Updates