మీడియాను నియంత్రిస్తే అర్టికల్ 19 ఉల్లంఘించినట్టే

సెక్రటేరియట్ కూల్చివేత పనులను కవర్ చేయడానికి మీడియాను అనుమ‌తించాల‌న్న‌ పిటీషన్ పై న్యాయస్థానం సోమ‌వారం విచారణ జరిపింది. కూల్చివేత పనులు మీడియాకు చూపించడానికి 4 గంటలకు తీసుకెళ్తున్నామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలుప‌గా..‌ ప్ర‌భుత్వం దిగి రావడం , పోరపాటును సరిదిద్దు కోవడం మంచి పరిణామం అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. పత్రిక హక్కు, వాటి పరిధుల గురించి విస్థృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని కోర్టు ఈ విచార‌ణ‌లో తెలిపింది. ప్రభుత్వం ఏవైనా అంక్షలు పెట్టాలనుకుంటే.. లా ద్వారా ఆర్డ‌ర్ పాస్ చెయ్యాలి కానీ ఇష్టానుసారంగా చెయ్యడం, అంక్షలు పెట్టడం సరైంది కాదని తెలిపింది.

ఇవ్వాళ ఒక్క రోజే కాకుండా మీడియాను ఎప్పటికప్పుడు కూల్చివేత పనుల వద్దకు అనుమతి ఇవ్వాలని పిటీషన్ తరుఫు న్యాయవాది నవీన్ వాసిరెడ్డి కోర్టుకు తెలిపారు. ఒక టైం పెట్టి అదే టైంలో చిత్రీక‌రించుకోండి అని చెప్పడం సరైంది కాదని, మీడియా ఎప్పటికప్పుడు చిత్రీకరించుకోవడానికి అవకాశం ఇవ్వాల‌ని తెలిపారు. మీడియా ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లోచ్చని అన్నారు. ఎటువాంటి లా అండ్ ఆర్డ‌ర్ లేకుండా మీడియా ను నియంత్రించడంపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు.

భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఓపెన్ కోర్టులో విస్తృతంగా చర్చ జరిపి గైడ్ లైన్స్ తీసుకురావాలని కోర్టు అభిప్రాయ ప‌డింది. చట్టం ప్రకారం, లా ప్రకారం కాకుండా మీడియాను నియంత్రిస్తే అర్టికల్ 19 ఉల్లంఘించినట్టేన‌ని కోర్టు భావిస్తోంద‌ని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాను విధించిన నియంత్రణలు భారత రాజ్యంగం లోని అర్టికల్ 19 లోబడే ఉన్నాయని ప్రభుత్వం నిరుపించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. కోర్టు పేర్కొన్న అంశాలతో కౌంటర్ దాఖలు చెయ్యాల్సిందిగా అడ్వకేట్ జనరల్ ను న్యాయ‌స్థానం అదేశించింది.

High court secretariat

Latest Updates