సుర్రుమంటున్న సూర్యుడు : ముందుంది మండే కాలం

ఈ ఏడాది మార్చికి ముందే ఎండలు మొదలయ్యాయి. ఫిబ్రవరి మధ్యలోనే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చలి తగ్గి వారం అయ్యిందో లేదో… సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం టైమ్ లో ఎండకు తోడు… ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. దేశంలోని పశ్చిమ భాగం నుంచి గాలులు తగ్గిపోవడంతో ఎండలు పెరిగాయని  వాతావరణ శాఖ అంటోంది.

రికార్డు టెంపచేర్లకు కేరాఫ్ అయిన ఖమ్మం జిల్లాలో ఈసారి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నిన్న అత్యధికంగా 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్  జిల్లా బోదన్ , కామారెడ్డి జిల్లా లింగంపేటలో 37.6, సికింద్రాబాద్ లో 37.3 డిగ్రీల టెంపేచర్ నమోదైంది. చాలా జిల్లాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు.

రెండు రోజుల క్రితం నిజామాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీలు, హైదరాబాద్ లో 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి దీంతో ఉక్కపోత పెరిగింది. ఫిబ్రవరి మధ్యలోనే ఇలా ఉంటే రానున్న 3 నెలల్లో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయో అని టెన్షన్ పడుతున్నారు జనం.

గతేడాదితో పోలిస్తే… ఈసారి ఎండల తీవ్రత పెరిగే అవకాశముందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. 2016, 17 లో నమోదైన స్థాయిలో ఎండలు ఈసారి ఉండొచ్చని భావిస్తున్నారు. 2016 , 2017 లో ఏప్రిల్, మే నెలలో వడగాల్పులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు జనం. ఈ ఎండాకాలం కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Latest Updates