కరోనా పంజా: 24 గంటల్లో 7964 కేసులు..265 మంది మృతి

భారత్ లో కరోనా పంజా విసురుతోంది. రికార్డ్ స్థాయిలో ఎన్నడూ లేనంతగా గత 24 గంటల్లో 7964 కరోనా కేసులు నమోదవ్వగా 265 మంది చనిపోయారు. దీంతో ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,73,763 కు చేరింది. ఇందులో  82370 కోలుకోగా 86422 మంది చికిత్స తీసుకుంటున్నారు. 4971 మంది కరోనాతో చనిపోయారు. గత 24 గంటల్లో అత్యధికంగా 11263 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అత్యధికంగా మహారాష్ట్రలో 62228 కేసులు నమోదవ్వగా ఆ తర్వాత తమిళనాడులో 20246, ఢిల్లీలో 17386, గుజరాత్ లో 15944, రాజస్థాన్ లో 8365 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 2098 మంది కరోనాతో చనిపోయారు. ఆ తర్వాత  గుజరాత్ లో 980 మంది, ఢిల్లీ 398, మధ్యప్రదేశ్ లో 334, వెస్ట్ బెంగాల్ లో 302, ఉత్తర ప్రదేశ్ లో 201 మంది చనిపోయారు.

Latest Updates