దేశంలో ఉన్నత విద్యా వంతులు 2.64 కోట్లు

దేశంలో 2.64 కోట్ల మంది హైయర్ స్టడీస్ చదువుతున్నారని ఆల్‌ ఇండియా సర్వే ఆన్‌ హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌ (ఏఐఎస్‌‌హెచ్‌ ఈ) నివేదిక వెల్లడిం చింది.డిగ్రీ మొదలుకొని పీహెచ్‌ డీ వరకు ఉన్నత చదువుల్లో ఉన్నవారు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోనే అత్యధికం అని తెలిపింది.దక్షణాది రాష్ట్రాల్లో నే అత్యధిక కాలేజీలు,సీట్లు న్నాయని పేర్కొంది. ఈ మేరకు 2018–19 సంవత్సరానికి సంబంధించి చేసిన సర్వే ఫలితాలను మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్​ రీసోర్స్​ అండ్ డెవలప్ మెంట్ వెల్లడించింది.

దేశవ్యా ప్తం గా 2,64,65,449 మంది విద్యార్థులు హైయర్ స్టడీస్ చేస్తుండగా వారిలో ఉత్తరప్రదేశ్‌‌లో 47,91,749 మంది (18.10శాతం), మహారాష్ట్రలో 29,57,491 మంది(11.17 శాతం) చదువుతున్నారు. జాబితాలోమూడో స్థానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌ల నుంచి 24,17,378 మంది (9.13 శాతం)ఉన్నట్లు సర్వే వివరించింది.

దక్షిణాదిలోనే ఎక్కువ సీట్లు

18 నుం చి 23 ఏళ్ల వయసు గలవారిలో ప్రతి లక్షమందికి అత్యధిక కాలేజీలు, సీట్లు ఉన్నదిదక్షణాది రాష్ట్రాల్లో నే. ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్ లో అత్యధిక కాలేజీలుండగా, బీహార్​లో అతితక్కువగా ఉన్నాయి.

కాలేజీల్లో యూపీ టాప్

హైయర్​ స్టడీస్ కోర్సులు అందించే కాలేజీలు ఉత్తరప్రదేశ్‌‌లోనే ఎక్కువ. అక్కడ 6,447 కాలేజీలుండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4,497 కాలేజీలున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌‌లో 2,521, తెలంగాణలో 1,976 కాలేజీలు ఉన్నాయి. 4,340 కాలేజీలతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఏపీలో 82 శాతం, తెలంగాణలో 80 శాతం ప్రైవేటు కాలేజీలున్నాయి.

ఆర్ట్స్ & సైన్సే కామన్

డిగ్రీ, పీజీ, పీహెచ్ డీలో ఆర్ట్స్ , సైన్స్ , కామర్స్ కోర్సుల్లోనే అత్యధికమంది చేరుతున్నారు.ఎంబీబీఎస్ స్టూ డెంట్స్ కేవలం 0.74% మాత్రమే.

ఎన్ రోల్ మెంట్​ ప్యా టర్న్

​మొత్తం కాలేజీల్లో ప్రైవేట్, అన్ ఎయిడెడ్, ఎయిడెడ్​ కాలేజీలు 78 శాతం ఉండగా వాటిలో ఎన్ రోల్​మెంట్ కేవలం 66.4 శాతమే. ప్రభుత్వ కాలేజీలు 22 శాతమే ఉన్నా వాటిలో చదువుతున్న వారు 33.6 శాతం. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసుగల వారిలో గ్రాస్ ఎన్ రోల్​మెంట్ రేషియో 26.3%. ఇందులో 10.62 శాతం డిస్టెన్స్ విధానంలో నమోదు చేసుకున్నవారున్నారు .

 

Latest Updates