దక్కని ప్రభుత్వ స్కీంలు: హిజ్రాల ఆకలి బాధలు

కరోనా ఎఫెక్ట్ తో కష్టంగా బతుకు
రేషన్ కార్డు లేకపోవడంతో అందని సంక్షేమ ఫలాలు

మహబూబాబాద్‌‌, వెలుగు: కరోనా హిజ్రాల బతుకుపై ఎఫెక్ట్ చూపెడుతోంది.. రైళ్లు, బస్టాండ్లు, షాపుల్లో బిక్షాటన చేస్తూ పొట్టపోసుకునే హిజ్రాలు తిండి గింజలు లేక ఆకలితో బాధలు పడుతున్నారు. పేదల ఆకలిని తీర్చడానికి ప్రభుత్వం రేషన్‌‌షాపుల ద్వారా సబ్సిడీ బియ్యం ఇతర సరుకులు అందిస్తోంది . హిజ్రాలు ఎన్నో ఏండ్ల నుంచి రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు వేలకు పైగా హిజ్రాలున్నారు. కాగా,
రేషన్కార్డులు పొందడానికి పురుషులు, మహిళలకు మాత్రమే అర్హ‌త ఉంది.
దక్కని ప్రభుత్వ స్కీంలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు సంక్షేమ పథకాలను అందించడానికి రేషన్ కార్డుల వివరాలను పరిగణలోకి తీసుకుంటాయి. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారిని మాత్రమే పేదలుగా గుర్తిస్తాయి. దీంతో హిజ్రాలకు పేదలుగా అవకాశం దక్కకుండా పోతోంది. లాక్ డౌన్‌‌టైంలో ప్రతీ రేషన్ కార్డు కలిగిన వారికి 12 కిలోల ఉచిత రేషన్ బియ్యం, రూ.1500 ఆర్థిక సాయం అందించినప్పటికీ హిజ్రాలకు ఇవ్వలేదు. హిజ్రాల మహబూబాబాద్ జిల్లా నాయకురాలు అను మాట్లాడుతూ రేషన్ కార్డుల కోసం లీడర్లు, ఆఫీసర్ల‌ను ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కరించలేదన్నారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates