హిజ్రాలను నడిరోడ్డు మీద ఉరికించి కొట్టారు

విజయవాడ : డబ్బులు ఇవ్వకపోతే నానా రచ్చ చేస్తున్నారని హిజ్రాలపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం  విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో జరిగింది. ఉదయం నుంచే షాపులు తెరవగానే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని హిజ్రాలపై స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం కూడా గుంపులుగా వచ్చిన హిజ్రాలు ఇబ్రహీంపట్నంలోని పలు షాపుల దంగల ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో.. హిజ్రాలపై కొందరు వ్యక్తులు కర్రలతో వెంబడించి దాడికి పాల్పడ్డారు.

షాపుల దగ్గర డబ్బులు వసూలు చేస్తుండగా స్థానికులు వీరిపై దాడి చేశారని తెలిపారు ప్రత్యక్ష సాక్షులు. అయితే.. తాము అసలైన హిజ్రాలం కాదని తమపై దౌర్జన్యం చేశారని హిజ్రాలు ఆరోపించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు హిజ్రాలు.  ఈ ఘటనలో నలుగురు హిజ్రాలకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Latest Updates