బండ్లు ఆపి మరీ హిజ్రాల వసూళ్లు

hijras-troubles-devotees-in-tirumala

తిరుమలలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. స్వామిని ప్రశాంతంగా దర్శించుకుందామని వస్తున్న భక్తులకు, స్థానికులకు చుక్కలు చూపిస్తున్నారు. అడుక్కుంటే.. ఇచ్చింది తీసుకుని పోతే ఎవరికీ ఏ బాధ ఉండేది కాదనీ… కానీ.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని భక్తులు ఆవేదనగా చెబుతున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న రాం బగీచా బస్టాండు వెనకాల హిజ్రాలు కనబడితే పరారవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు స్థానికులు. జనం నడిచి వెళ్తున్నా.. వాహనాలపై వెళ్తున్నా అడ్డగించి మరీ నగదు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.

హిజ్రాలు రెచ్చిపోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని.. అంటున్నారు భక్తులు. పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చినా కూడా.. యాక్షన్ తీసుకోవడం లేదని చెబుతున్నారు.

Latest Updates