గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది

బంగారం రేటు మరింత పెరిగింది. గోల్డ్ పై కస్టమ్స్ టాక్స్ ను పెంచుతున్నట్టు కేంద్రం బడ్జెట్ లో ప్రకటించింది. దీంతో.. బంగారం ధర బులియన్ మార్కెట్లో బుల్లెట్ లా దూసుకెళ్లింది. ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం రూ.34వేలకు పైనే ఉంది. కేంద్రం నిర్ణయంతో బంగారం రేట్… శుక్రవారం రోజున రూ.590 పెరిగింది. ఇండియన్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం రూ.34వేల 8వందలకు చేరింది.

వెండి ధర మాత్రం కొంత తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రేటు.. రూ.38వేల 500గా ఉంది.