హిమదాస్‌కు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ లో చోటు

భారత అథ్లెటిక్ హిమదాస్‌ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ లో చోటు దక్కించుకుంది. నెల రోజుల వ్యవధిలోనే ఐదు ఇంటర్నేషన్ గోల్డ్ మెడల్స్ సాధించి…అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సమయంలో ప్రపంచ అథెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో హిమదాస్‌ చోటు సంపాదించింది. ఆమెతో పాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే 25 మంది ప్లేయర్ల లిస్టును భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య ప్రకటించింది. 400 మీటర్ల రేసు విభాగంలో హిమదాస్‌ అర్హత సాధించింది. ఈనెల 27 నుంచి అక్టోబరు 6 వరకు దోహాలో వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది.

 

Latest Updates