
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ చేత గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. 1959 సెప్టెంబర్ 9న జన్మించిన కోహ్లీ.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా చదివారు. ఆమె 2006 మే 29న ఢిల్లీ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2007 ఆగష్టు 9 ఢిల్లీ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమాకోహ్లీ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశంలోని 25 హైకోర్టుల్లో ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీనే కావడం గమనార్హం.
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ చేత గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. దాంతో తెలంగాణకు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ రికార్డుకెక్కారు. సెప్టెంబరు 2, 1959న ఢిల్లీలో జన్మించిన హిమా కోహ్లీ.. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంఏ తర్వాత లా చదివారు. 1984లో లా డిగ్రీ పొంది, అదే ఏడాది ఢిల్లీ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. 1999 – 2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌కు న్యాయ సలహాదారుగా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యురాలిగా కూడా హిమా కోహ్లీ పనిచేశారు. ఆ తర్వాత ఆమె మే 29, 2006న ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆగస్టు 29, 2007న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మే 20, 2019 నుంచి ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, జూన్ 30, 2020 నుంచి నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమాకోహ్లీని సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
Hon'ble Governor Dr. Tamilisai Soundararajan administered the oath of office to Kumari Justice Hima Kohli, as Chief Justice, High Court for the State of Telangana at Raj Bhavan today. Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao was present at the Swearing-in Ceremony. pic.twitter.com/7ZTFx53aSp
— Telangana CMO (@TelanganaCMO) January 7, 2021
For More News..