ఆవుల‌కు పెన్ష‌న్..నెలకు ఎంతంటే

సాధార‌ణంగా మ‌న‌కు తెలిసి పెన్ష‌న్ మ‌నుషుల‌కు మాత్ర‌మే ఇస్తారు. కానీ ఇప్పుడు మూగ‌జీవాల‌కు పెన్ష‌న్ ఇచ్చేందుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

రాబోయే 18 నెలల్లో రాష్ట్రంలో వీధి ఆవుల‌కు పెన్ష‌న్ ఇస్తున్న‌ట్లు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ ప్ర‌క‌టించారు.

‘గోసాదన్ / గ‌ఓశాల / ఆవు అభయారణ్యం , జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమ ప‌థ‌కం రెండో దశ ప్రారంభంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ పథకం కింద 30 ఆవుల‌కు ఒక్కో ఆవుకు నెలకు ₹ 500 నిర్వహణ కోసం పెన్ష‌న్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పంచాయతీలు, మహిళా మండలిలు , స్థానిక సంస్థలు, ఆవుల‌కు ఆశ్ర‌యాల్ని క‌ల్పించే వారికి ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని అన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అమ్మే మ‌ద్యం సీసా బాటిల్ పై రూ.1.50 పైస‌ల్ని వ‌సూలు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు సీఎం జైరామ్ ఠాకూర్ తెలిపారు.

Latest Updates