అబుదాబి కోర్టుల్లో అధికార భాషగా హిందీ

కోర్టు వ్యవహారాలలో హిందీని అధికారిక భాషగా గుర్తిస్తూ అబుదాబి న్యాయ శాఖ(ADJD) ఉత్తర్వులు విడుదల చేసింది. అరబిక్ ప్రధాన అధికార భాష కాగా, ఇంగ్లిష్ రెండోది. తాజాగా హిందీని మూడో అధికార భాషగా ప్రభుత్వం గుర్తించింది. దేశంలో వలస జీవులు, హిందీ మాట్లాడే కార్మికుల సంఖ్య ఎక్కువ. అధికారిక లెక్కల ప్రకారం UAE జనాభాలో యాభై లక్షల వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన వలస కార్మికులే. ఇందులో ఇండియన్ల సంఖ్యే ఎక్కువ. వీరిలో హిందీ మాట్లాడే వారే ఎక్కువ. లేబర్ చట్టాలు అరబిక్,ఇంగ్లీష్ బాషల్లో ఉండడంతో కార్మికులకు న్యాయం దక్కడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. భాషా సమస్య కారణంగా కోర్టు లిటిగేషన్లలో వారు నష్ట పోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబి న్యాయ శాఖ తెలిపింది.

Latest Updates