బండి సంజయ్ కు అభిమానుల తులాభారం

భైంసా బాధితులకు ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బాధితులకు హిందూసమాజం అండగా ఉంటుందన్నారు. భైంసా బాధితుల సహాయార్థం చేపట్టిన తులాభారంలో పాల్గొన్న సంజయ్..తులాభారం ద్వారా వచ్చిన డబ్బులను వారికి అందజేస్తామన్నారు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తుందని విమర్శించారు. హిందువులపై సర్కార్ వివక్ష చూపుతుందని ఆరోపించారు.

బీజేపీ అభిమానులు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తులాభారం నిర్వహించారు. హైదరాబాదులోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలోఆయన ఎత్తు నాణేలతో ఈ తులాభారం చేపట్టారు.

Latest Updates