
నిర్మల్, వెలుగు: చత్రపతి శివాజీ మహారాజ్ 352వ పట్టాభిషేక వార్షికోత్సవాన్ని సోమవారం నిర్మల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శాస్త్రినగర్‌లోని ఆధ్యాత్మిక, పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి క్యాంపు ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో పాకాల ఫౌండేషన్ చైర్మన్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్‌కు పట్టాభిషేకం జరిగిన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
శివాజీని స్ఫూర్తిగా తీసుకొని హిందువులంతా సంఘటితంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. దిలావర్పూర్ పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, మాజీ సర్పంచ్ పడకండి రమేష్ రెడ్డి, వినయ్ సుధాకర్ అరుణ్ పాల్గొన్నారు.
శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో..
నిర్మల్ పట్టణంలో ఉన్న శివాజీ చౌక్‌లోని విగ్రహానికి శివాజీ సేవా సమితి నాయకులు పూలదండలు వేసి నివాళులర్పించారు. సేవాసమితి వ్యవస్థాపకుడు మెడిసిమ్మె రాజు, సమితి బాధ్యులు అయ్యన్నగారి భూమయ్య, శంకర్రావు, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి,బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.