అమెరికా హిందూ దేవాలయాలలో వరుస దొంగతనాలు

hindu-temple-robbery-in-clayton-county-america

అమెరికాలోని హిందూ గుడులల్లో వరుస దొంగతనాలు జరిగాయి. మే 17న కమ్మింగ్‌లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో, 18న అట్లాంటాలోని రివర్‌డేల్‌లోని ఆలయంలో పట్టపగలే దేవుని నగలను దొంగతనం చేశారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒకే గ్రూపుకు చెందిన దొంగలు ఈ రెండు గుడులల్లో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు.

గుడిలో దొంగతనం చేయడానికి వచ్చిన వారు.. రెండు టీంలు గా విడిపోయి దొంగతనాలు చేశారని చెప్పారు పోలీసులు. ఒకరు పూజారితో హిందూ సాంప్రదాయం గురించి, ఆలయం గురించి అడిగి తెలుసుకుంటుండగా.. మరో టీం గర్భగుడిలోకి వెళ్లి నగలను దొంగతనం చేస్తున్నారని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

 

Latest Updates