పాకిస్తాన్ లో పోలీస్ అయిన తొలి హిందూ మహిళ…

పాకిస్తాన్ లో పోలీస్ జాబ్ సాధించిన తొలి హిందూ మహిళగా రికార్డుల కెక్కింది ఓ యువతి.  పుష్ప కొల్హి అనే అమ్మాయి సింధ్ పబ్లిక్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో.. ASI గా ఎంపికైంది. దీంతో పాక్ లో పోలీస్ అధికారిగా సెలక్ట్ అయిన తొలి హిందూ యువతిగా గుర్తింపు పోందింది. సింధూ ప్రావిన్స్ లో పుష్ప కొల్హికి పోస్ట్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్పకు అభినందనలు తెలిపారు. పాకిస్తాన్ లో హిందువులు మైనారిటి కమ్మునిటిగా ఉన్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం 75 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇదే సంవత్సరం జనవరిలో…  హిందూ అయిన సుమన్ పవన్ బోదాని సివిల్ మెజిస్ట్రేట్ గా నియమితులవగా… ఇప్పుడు పుష్ప పోలీస్ అధికారిగా ఎంపికైంది.

Latest Updates