హిందూపురం: రైల్వే ట్రాక్ పై 4 మృతదేహాలు

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హిందూపురం మండలంలోని రైల్వే ట్రాక్‌పై నాలుగు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. 2 కిలోమీటర్ల కు ఒక మృతదేహం చొప్పున పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. హిందూపురం మండలం కోటిపి వద్ద రైల్వే పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో ఒకరు అది పురుషునిది కాగా మరొకరది మహిళలది. ఈ సంఘటన జరిగిన చోటు నుంచి రెండు కిలోమీటర్ల సమీపంలోని మలుగూర్ వద్ద ఒక మృతదేహం… దేవరపల్లి వద్ద మరో మృతదేహం కనిపించింది. మీరు శరీర భాగాలన్నీ రైలు కింద పడి చెల్లాచెదురుగా పడ్డాయి. వీరంతా ఒకే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వీరిలో ఒక వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేనట్లు తెలుస్తోంది. అయితే వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు లేదా అన్న వివరాలు తెలియాలి. మరోవైపు వీరిని ఎవరైనా హత్య చేశారా లేక వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా అన్నది కూడా పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Latest Updates