రేయ్ సీఐ.. నా పక్కన కూర్చో : ఎంపీ

hindupuram-mp-gorantla-madhav-calls-ci-in-friendly-way-makes-public-shock-270793-2

అనంతపురం రూరల్ సీఐని ఉద్దేశించి.. హిందూపురం ఎంపీ అరుపు

రేయ్ సీఐ… అంటూ అనంతపురం రూరల్ సీఐ డి.మురళీధర్ రెడ్డిని ఉద్దేశించి.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పిలవడంతో అక్కడ ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయారు. ఆ వెంటనే ఎంపీ.. రేయ్ సీఐ.. ఇలా వచ్చి నా పక్కన కూర్చో అని అన్నారు. వేదికపైకి వచ్చిన సీఐని.. ఎంపీ ఆలింగనం చేసుకుని…. తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. దీంతో.. అందరూ షాక్ నుంచి బయటకొచ్చి రిలాక్సయ్యారు.

ఈ సీన్ అనంతపురం రూరల్ మండలం.. కొడిమి గ్రామం.. వన మహోత్సవంలో కనిపించింది. ఈ కార్యక్రమానికి ఎంపీ గోరంట్ల మాధవ్ గెస్ట్ గా వచ్చారు. అనంతపురం రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి బందోబస్త్ విధుల్లో భాగంగా ప్రోగ్రామ్ కు వచ్చారు. అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తున్నప్పుడు… రేయ్ సీఐ.. వచ్చి నా పక్కన కూర్చో అంటూ ఎంపీ వేదికపైకి పిలిచారు. “నా ప్రాణ స్నేహితుడు నాకే బందోబస్త్ నిర్వహించడం ఏంటి.. నా పక్కనే కూర్చుంటాడు” అని అందరితో చెప్పాడు.

ఎంపీ కాకముందు కదిరి సీఐగా ఉద్యోగం చేసేవారు గోరంట్ల మాధవ్. సీఐ మురళీధర్ రెడ్డి… గోరండ్ల మాధవ్ ఇద్దరూ మంచి స్నేహితులు. కొన్ని దశాబ్దాలుగా వీళ్ల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే ఎంపీ అయ్యాక కూడా… సీఐని తన దోస్త్ గా అందరికీ మరోసారి పరిచయం చేస్తూ… వేదికపైకి పిలిచారు. విధి నిర్వహణలో ఎటువంటి ఒత్తిళ్లకు మురళీధర్ రెడ్డి తలొగ్గడని.. అతడు ఇంటలిజెంట్ అని పొగిడారు గోరంట్ల మాధవ్. ఎంపీ-సీఐ మధ్య స్నేహబంధం, పలకరింపులను కార్యక్రమానికి వచ్చిన వారంతా ఎంజాయ్ చేశారు.

Latest Updates