హిందూస్థాన్‌ షిప్‌యార్డ్ ప్ర‌మాదం : మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం

హిందూస్థాన్‌ షిప్‌యార్డ్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్‌ కూలి 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కొత్తగా కొనుగోలు చేసిన క్రేన్‌ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్ర‌మాదం పై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. పరిహారంపై అధికారులు, కార్మికులతో మంత్రి చర్చలు జరిపారు. ఒప్పంద కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ సంస్థల్లో నిరంతర ఉపాధి కల్పిస్తామని అవంతి తెలిపారు. శాశ్వత ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు హెచ్‌ఎస్ఎల్‌ ద్వారా వచ్చే ప్రయోజనాలు అదనంగా ఇప్పిస్తామని పేర్కొన్నారు.

Latest Updates