హిప్పీ : సినిమా రివ్యూ

రివ్యూ- హిప్పీ
తారాగణం: కార్తికేయ, దిగంగన సూర్యవంశి, జెడి చక్రవర్తి, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌, జాజ్బా సింగ్‌ తదితరులు
మాటలు: టి.ఎన్‌. కృష్ణ, కాశిరాజు
కూర్పు: కె.ఎల్‌. ప్రవీణ్‌
సంగీతం: నివాస్‌ కె. ప్రసన్న
ఛాయాగ్రహణం: ఆర్‌.డి. రాజశేఖర్‌
నిర్మాత: కలైపులి ఎస్‌. థాను
కథ, కథనం, దర్శకత్వం: టి.ఎన్‌. కృష్ణ
విడుదల తేదీ: జూన్‌ 6, 2019

కథ

కిక్ బాక్స‌ర్ అయిన హిప్పీ దేవ‌దాస్ (కార్తికేయ‌)కు స్నేహ(జెజ్‌బా సింగ్) ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తుంది. దేవ స్నేహ‌తో డేటింగ్ లో ఉన్న‌ప్పుడే గోవా వెళుతున్న స‌మ‌యంలో ఆముక్త మాల్య‌ద ( దిగంగ‌న సూర్య‌వ‌న్షీ) ని చూసి ఇష్ట‌ప‌డి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిన దేవా స్నేహ‌తో ల‌వ్ లో లేడ‌ని తెలుసుకుని ఆముక్త‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తాడు. ముందు ఫ్రెండ్ ల‌వ‌ర్ ను త‌న ల‌వ‌ర్ గా ఆముక్త ఒప్పుకోక‌పోయిన‌ప్ప‌టికీ త‌ర్వాత స్నేహే వాళ్లిద్ద‌రినీ ఒక‌టి చేస్తుంది.ఆ తర్వాత వాళ్ళిద్దరి ప్రేమకథ లో జరిగిన సంఘటనలు ఏంటి.వీళ్ళ కథ లో దేవా బాస్ (జెడి) పాత్ర ఏంటి..ఆయన పెట్టిన కండిషన్ ఏంటి.. చివరకు వాళ్ళ కథ సుఖాంతం అయ్యిందా లేదా అనేది సస్పెన్స్..

హీరో కార్తికేయ‌కు ఈ సినిమాలో బాగా వేరియేష‌న్స్ చూపించే అవ‌కాశం దొరికింది. అటు లుక్స్ తో పాటూ, ఇటు యాక్టింగ్ ప‌రంగానూ మంచి మార్కులే కొట్టేశాడు. యాక్ష‌న్ సీన్స్ లోనూ బాగా చేశాడు.హీరోయిన్లు దిగంగ‌నా,జెజ్‌బా సింగ్ లు గ్లామర్ కు ఎక్కువ నటనకు తక్కువ అనేటట్టు ఉన్నారు.జెడీ చ‌క్ర‌వ‌ర్తి అర‌వింద్ పాత్ర‌లో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ తో కాసేపు న‌వ్విస్తాడు., శ్ర‌ద్ధా దాస్, బ్రహ్మాజీ, సుద‌ర్శ‌న్ లు త‌మ ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక వర్గ పనితీరు

రాజశేఖర్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. నివాస్‌ కే ప్రసన్నా మ్యూజిక్ లో రెండు పాటలు బాగున్నాయి.రీ- రికార్డింగ్ బాగాలేదు.ఎడిటింగ్ లో లోపాలున్నాయి.ఈజీగా నాలుగైదు సీన్లు కత్తిరించాల్సింది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయ్.

విశ్లేషణ

హిప్పీ చిత్రంతో యూత్ ని టార్గెట్ చేసిన డైర‌క్ట‌ర్ ..ప్రేమ‌, రొమాన్స్, లివింగ్ రిలేష‌న్స్ నేప‌థ్యంలో ప్ర‌స్తుత త‌రానికి అనుగుణంగా క‌థ‌ను రెడీ చేసుకున్న‌ప్పటికీ, ఓ ప‌దేళ్ల త‌రువాతి జెన‌రేష‌న్ ఎలా ఉండ‌బోతుందో చూపించాడు. రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలోనూ కాస్త లిమిట్స్‌ క్రాస్‌ చేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కథ పరంగా బాగానే ఉన్నా కథనం మాత్రం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదనిపించినా సెకండాఫ్ గాడి తప్పి ప్రేక్షకులను బోర్ కొట్టిస్తుంది. ఓవరాల్ గా “హిప్పీ” టార్గెట్ ఆడియన్స్ కు కూడా ఆకట్టుకోదు. “ఆర్ఎక్స్ 100” లాంటి ఇంటెన్స్ కథ తర్వాత కార్తికేయ ఇలాంటి నాసిరకమైన కథ కు ఓకే చెప్పి నిరాశపరిచాడు.

Latest Updates