ఐటమ్ వ్యాఖ్యలు నాకే నచ్చలేదు : రాహుల్ గాంధీ

తాను చేసిన ఐటమ్ వ్యాఖ్యలపై అది రాహుల్ గాంధీ అభిప్రాయని అన్నారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్. త్వరలో మధ్యప్రదేశ్ లో బైపోల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ నాథ్  దాబ్రా నియోజకవర్గం గ్వాలియర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సురేష్ రాజాపై పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి ఇమ్రతీ దేవి ఐటమ్ అంటూ వ్యాఖ్యనించారు. ఆ వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. కమల్ నాథ్ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ నాథ్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. కమల్ నాథ్ పార్టీకి చెందిన వారే. కానీ ఆయన మాటలు నాకే నచ్చలేదు. అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమనన్నారు. రాహుల్ స్పందన పై  కమల్ నాథ్ మాట్లాడుతూ  తానెవరిని కించపరచలేదని, ఒకవేళ ఎవరినైనా తన మాటలతో ఇబ్బంది పడి ఉంటే  చింతిస్తున్నట్లు తెలిపారు.

Latest Updates