స్ట్రైకర్ తో కొడితే.. రికార్డు పడ్డట్లే

హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్, సాజిదా దంపతుల కూతురు షేక్ హుస్నా సమీరా. తండ్రి ప్రైవేట్ ఉద్యోగి. తల్లి స్వచ్ఛంద సేవకురాలు. ఐదో తరగతిలో ఉండగా హుస్నా ఇంటికి ఆమె బాబాయి వెళ్లారు. సరదాగా క్యారమ్స్‌ ఆడుతున్న హుస్నాను చూసి నేర్చుకుంటే మంచి గుర్తింపు వస్తుందని ప్రోత్సహించారు. అప్పటికే ఆయన ఆంధ్ర రాష్ట్ర క్యారమ్స్‌ అసోసియేషన్‌ సెక్రెటరీగా ఉన్నారు. ఆయన సలహాతో క్యారమ్స్‌ పై మరింత ఇష్టం పెంచుకున్న హుస్నా చదువుకుంటూనే క్యారమ్స్‌ ఆడటం ప్రారంభించింది. రెండేళ్లలోనే రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు చేజిక్కించుకుంది. 2012లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించింది. 2013లో సబ్‌ జూనియర్స్‌ పోటీల్లో టీమ్‌‌‌‌ చాంపియన్‌ షిప్‌ లో నాలుగో స్థానంలో నిలిచింది. ఎన్నో రికార్డులు నెలకొల్పగలదనే నమ్మకంతో ఆమెకు రాష్ట్ర క్యారమ్స్‌ సెక్రెటరీగా పని చేస్తు న్న డా. నీరజ్‌ సంపత్‌ ఎంతగానో సహకరించారు.

కాలిగ్రఫీలోనూ నేషనల్‌ అవార్డు….

హుస్నా కేవలం క్యారమ్స్‌కే పరిమితం కాలేదు. కాలిగ్రఫీలో తన నైపుణ్యాన్ని పెంచుకుంది. తన ప్రతిభతో 2013లో ‘నిపుణ’ నేషనల్‌ అవార్డును దక్కించుకుంది. 32 రకాల చేతిరాతలతో చూపురులను విస్మయానికి గురి చేసేలా సామర్థ్యాన్ని పెంచుకుంది.క్యారమ్స్‌ , కాలి గ్రఫీలో రాణిస్తూ రికార్డులు సాధించడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది.

సాధించిన రికార్డులు…

గిన్నిస్‌ బు క్‌ ఆఫ్‌ వరల్డ్‌‌‌‌ రికార్డు, లిమ్కా బు క్‌ ఆఫ్‌ రికార్డ్‌‌‌‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డు , ఎవరెస్ట్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ రికార్డు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, అమేజింగ్‌ వరల్డ్‌‌‌‌ రికార్డు, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, అసిస్ట్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ రికార్డు, యూనివర్సె ల్‌ రికార్డు, భారత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, రికార్డు హోల్డర్స్‌ రిపబ్లిక్‌ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్‌ రికార్డు, మెరాక్యుల్స్‌ వరల్డ్‌‌‌‌ రికార్డు, స్టార్‌ వరల్డ్‌‌‌‌ రికార్డు, యూనిక్‌ వరల్డ్‌‌‌‌ రికార్డు, గోల్డెన్‌ స్టార్‌ వరల్డ్‌‌‌‌ రికార్డు, స్టేట్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో తన పేరు నమోదు చేసుకుంది. 2016 డిసెంబర్ 25, 26 తేదీల్లో 12 ఏళ్ల కిందట ఉన్న ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. యూఎస్ చేసిన 36 గంటల రికార్డును 34 గంటల 45 నిమిషాల 56 సెకన్లు క్యారమ్ ఆడి బ్రేక్ చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.

2017లో జాతీయ స్థాయి పోటీల్లో నాలుగో స్థానం సాధించింది. కాలి ఫోర్నియా నుం చి బర్కిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను అందుకుంది. 2018లో నాగ్ పూర్ లో జాతీయ స్థాయిలో పోటీల్లో మూడో స్థానం సాధించింది. 2018లో గ్రాండ్ స్లా మ్ పోటీల్లో జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. 2018లో హైదరాబాద్ లో జరిగిన హసీనా మెమోరియల్ ఫస్ట్ ఇండియన్ గ్రాండ్ స్లా మ్ పోటీల్లో డబుల్స్, సిం గిల్స్ లో విభాగాల్లో రెండో స్థానం సాధించింది. 2018 ఎయిల్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఏడాది పాటు స్కా లర్ షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

డిగ్రీ చదువుతూనే…

ప్రస్తుతం హుస్నా సమీర కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో బీకాం కంప్యూటర్స్  సెకండ్‌‌‌‌ ఇయర్‌ చదువుతోంది. ఆమెను కళాశాల ప్రిన్సిపల్ ఆరోఖ్యరాజ్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని విభాగాల్లో కలిపి 30 నేషనల్స్ ఆడింది. ఇటీవల ఆమె పేరును ఏపీ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ప్రపోజ్ చేసింది. మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.

Latest Updates