ఎకనామికల్‌గా దెబ్బతీయాలి.. అందుకే చైనా ప్రాడెక్ట్స్‌ బ్యాన్‌ చేయండి

  • ప్రజలకు విజ్ఞప్తి చేసిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

భోపాల్‌: ఇండియా – చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒకరు చైనాపై కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను బ్యాన్‌ చేయాలని అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుందని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు. చాలా మంది నేతలు లీడర్లు కూడా ఈ మేరకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కూడా ఈ విషయంలో స్పందించారు. చైనాను ఎకనామికల్‌గా దెబ్బతియాలని అప్పుడే బుద్ధి వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలంతా చైనా వస్తువులను బ్యాన్‌ చేయాలని రిక్వెస్ట్‌ చేశారు. “ మన ఆర్మీ చైనావాళ్లను కచ్చితంగా తిప్పికొడుతుంది. మనం కూడా వాళ్ల వస్తువులను కొనడం మానేసి వాళ్లను ఎకనామికల్‌గా దెబ్బతీయాలి”అని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. చైనా మొబైల్‌ యాప్స్‌ను వాడొద్దని, బ్యాన్‌ చేయాలని ఇంటెలిజెన్స్‌ అధికారులు హెచ్చరించారు. అంతే కాకుండా చైనా ఫుడ్‌ను కూడా నిషేధించాలని, రెస్టారెంట్లను కూడా మూసేయాలని రాజకీయ నాయకుడు అత్వాలే సూచించారు. చాలా చోట్ల చైనా వాళ్ల ప్రాడెక్ట్స్‌ అన్నీ కాల్చి పడేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Latest Updates