హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్లు హతం

జమ్ముకశ్మీర్: శ్రీనగర్‌లో  ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్లు హతమైనట్టు తెలుస్తోంది. తారిక్‌ మౌల్వి అలియాస్‌ ముఫ్తీ వకాస్‌, లతీఫ్‌ టైగర్ గా వారిని గుర్తించినట్టు సమాచారం.

కశ్మీర్‌ సోఫియాన్‌లో ఈ ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఓ జవాను కూడా గాయపడ్డాడు. సోఫియాన్‌లో మరో ఇద్దరు తీవ్రవాదులు దాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గతేడాది హతమైన బుర్హన్‌ వాని బృందానికి చెందిన మిలిటెంట్లలో లతీఫ్‌ టైగర్‌ చివరివాడని అధికారులు చెబుతున్నారు.

శుక్రవారం ఉదయం నుంచి ఉగ్రవేట కొనసాగుతోంది. రాష్ట్రీయ రైఫిల్స్‌తో పాటు స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ ఈ ఆపరేషన్‌ లో పాల్గొంటున్నాయి.

Latest Updates