అక్రమ లే ఔట్ల కూల్చివేతకు HMDA రెడీ : మే 10 నుంచి స్పెషల్ డ్రైవ్

HMDA పరిధిలో అక్రమ లే అవుట్స్ ను లేపేయాలని ప్రభుత్వం డిసైడైంది. ఏప్రిల్ 29 నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అక్రమ లేఔట్స్ గుర్తించాలని సంబంధిత అధికారులను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. అక్రమ లే ఔట్లు చేసిన వాళ్లకు నోటీసులు పంపించనుంది. ఇప్పటికే కొందరికి నోటీసులు అందించింది. వచ్చే నెల 10 తేదీ తరవాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లే ఔట్లను కూల్చివేయనుంది. అక్రమ లే అవుట్లకు సహకరించే అధికారులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్లాట్స్ కొనే వాళ్ళు హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో లే -ఔట్ కు అనుమతి ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు అధికారులు.

 

Latest Updates