నన్నుకాంగ్రెస్ చీఫ్ ను చేస్తే పార్టీని గాడిలో పెడతా: షేర్ ఖాన్

hockey-olympian-aslam-sher-khan-offers-to-be-rahul-gandhis-substitute-as-congress-president-for-2-years

న్యూఢిల్లీ‘మీ సీటును రెండేళ్ల పాటు నాకివ్వండి. పార్టీకి పాత వైభవం తీసుకొచ్చి చూపిస్తాను. హాకీ ఆటగాడిగా ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడి జట్టును గెలిపించిన తరహాలోనే కాంగ్రెస్​పార్టీని విజయతీరాలవైపు నడిపిస్తా.. నా వయసు, అనుభవం కాంగ్రెస్​చీఫ్​పోస్టుకు సరిపోతాయని అనుకుంటున్నా. నామీద నమ్మకం ఉంచి, పార్టీ చీఫ్​ను చేస్తే మీకు మాట రానివ్వను’.. కాంగ్రెస్​పార్టీ ప్రెసిడెంట్​రాహుల్​గాంధీకి కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి హాకీ ప్లేయర్​అస్లాం షేర్​ఖాన్​ లేఖ రాశారు. మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్​పదవికి రాజీనామా చేయనున్నట్లు రాహుల్​గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే! అయితే, పార్టీ ఉన్నత స్థాయి కమిటీ రాహుల్​గాంధీ రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరించింది. యూపీఏ చైర్​పర్సన్​సోనియా గాంధీ సహా సీనియర్​నేతలంతా రాజీనామా నిర్ణయంపై మళ్లీ ఆలోచించాలంటూ రాహుల్​గాంధీకి సూచించారు. కాంగ్రెస్​చీఫ్​గా రాహులే కొనసాగాలంటూ రాష్ట్రాల నుంచి పార్టీ నేతలు లేఖలు రాస్తున్నారు. కార్యకర్తలు కూడా అదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. సీనియర్​నేతలు ఎవరూ రాహుల్​కు ఆల్టర్నేటివ్​గురించి ఆలోచించడమే లేదు. ఈ క్రమంలో తొలిసారిగా ‘మీరు​తప్పుకుంటే కాంగ్రెస్​కు నేను నాయకత్వం వహిస్తా’నని రాహుల్​గాంధీకి షేర్​ఖాన్​లేఖ రాశారు.

ఎవరీ షేర్​ఖాన్​?

ఇండియన్​హాకీ జట్టు సభ్యుడు.. 1975లో హాకీ వరల్డ్​కప్ గెల్చుకున్న భారత జట్టులో షేర్​ఖాన్​కూడా ఉన్నారు. 1972 మ్యూనిచ్​ఒలింపిక్స్​లో పతకం గెల్చిన ఇండియన్​టీంలో ఆయన ఒకరు. తర్వాత కాంగ్రెస్​పార్టీలో చేరి మధ్యప్రదేశ్​నుంచి రెండుసార్లు లోక్​సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.  2016 లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అప్పటి కాంగ్రెస్​చీఫ్​సోనియా గాంధీకి లేఖ రాశారని మధ్యప్రదేశ్​అధికార ప్రతినిధి కేకే మిశ్రా తెలిపారు. ఆయన రాజీనామాను పార్టీ ఆమోదించిందని చెప్పారు.

 

 

Latest Updates