ఇదేం ప్యాకేజ్​?..కేంద్ర సాయం ఉత్త బోగస్

  •  కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ చాలా దుర్మార్గమైంది. పూర్తిగా ఫ్యూడల్​ విధానంలో ఉంది. మేం ఖండిస్తున్నం.
  •  మేం అడిగింది ఇది కాదు. రాష్ట్రాల చేతుల్లోకి డబ్బు రావాలని కోరినం. కానీ, రాష్ట్రాలను బెగ్గర్స్​గా భావించింది.
  • 2 శాతం ఎఫ్​ఆర్​బీఎం పెంచింది. అందులో ఆంక్షలు దరిద్రంగా ఉన్నయ్. ఇది ప్యాకేజీయేనా..? వాట్​ ఈజ్​ దిస్​.
  • కేంద్రం ఇట్ల వ్యవహరించవచ్చునా..? ఇక రాష్ట్ర ప్రభుత్వం దేనికి ఈడ. ప్యాకేజీ పచ్చి మోసం.. దగా.. అంకెల గారడీ.. అంతా గ్యాస్​.
    కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకుంది.
  • రియల్లీ పెయిన్​ఫుల్. రాష్ట్రాల మీద ఈ రకంగా పెత్తనం చెలాయించడమేంది? ప్రధాని చెప్పిన ఫెడరలిజం ఇంకెక్కడుంది?
  • కేంద్ర సాయం ఉత్త బోగస్​. ఆ రిఫార్మ్స్​.. మేం చెయ్యం.. వాటిని తీసుకోం. తట్టుకొని నిలబడ్తం.
  • కేంద్రం ఇచ్చే ముష్టిరూ. 2,500 కోట్లు మాకు అక్కర్లేదు. మేం సబార్డినేట్స్​ కాదు.

హైదరాబాద్​, వెలుగుకేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని సీఎం కేసీఆర్​ తీవ్రంగా తప్పుపట్టారు. అది బోగస్​, దుర్మార్గమైన ప్యాకేజీ అని వ్యాఖ్యానించారు. ‘‘మేం అడిగింది ఇది కాదు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలని కోరినం” అని చెప్పారు. ‘‘కేంద్రం ప్యాకేజీ పచ్చి మోసం, దగా, గ్యాస్, అంకెల గారడి. ఫెడరల్​ వ్యవస్థలో అవలంబించే విధానం ఇది కాదు” అని విమర్శించారు. ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకుందన్నారు. ‘‘కేంద్రం ప్యాకేజీ బోగస్. అంతా గాయి కత. 20 లక్షల కోట్ల రూపాయలు కాదు కదా లక్ష కోట్లు కూడా లేదు. దుర్భరమైన విపత్తులో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నయి. ఇలాంటి పరిస్థితుల్లో నగదు లభ్యత పెంచేలా చేయగలగాలి. కేంద్రం మాత్రం రాష్ట్రాలను భిక్షగాళ్లుగా, బెగ్గర్స్​గా భావించింది” అని వ్యాఖ్యానించారు. ‘‘కేంద్రం రాష్ట్రాల రుణ పరిమితిని (ఎఫ్​ఆర్బీఎం) పెంచింది. మన రాష్ట్ర రుణపరిమితి ఇప్పుడు 3.5 శాతం ఉంది. దీన్ని 5 శాతానికి పెంచారు. దీని వల్ల రూ.20 వేల కోట్లు అప్పు తీసుకునే అవకాశం ఉంటది. అలా తీసుకున్న అప్పును రాష్ట్రమే కట్టాలి. అయినా మళ్లీ దీంట్లో ప్రతి రూ. 2500 కోట్లకు ఒక నిబంధన పెట్టింది. మార్కెట్​ కమిటీలపై కేంద్రం నిబంధనలు అమలు చేయాలట. మున్సిపాలిటీలో ప్రజలపై పన్నులు వేసి ఆదాయం పెంచితే రుణం తీసుకోవచ్చట. కరెంటులో సంస్కరణలు చేయాలట. వన్​ నేషన్​… వన్​ రేషన్​ కార్డు అన్నరు. ఈజ్​ ఆఫ్​ డూయింగ్​లో బాగుండాలట. వీటిలో వన్​ నేషన్​, వన్​ రేషన్​లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఈజ్​ ఆఫ్​ డూయింగ్​లో మన మనం చాంపియన్స్​మి. కేంద్రం చెప్పిన నాలుగు నిబంధనల్లో మూడు చేస్తే ఇంకో రూ. 5 వేల కోట్ల రుణం వచ్చే అవకాశం ఉంటది. ఇలా ఆంక్షలు పేరిట మెడ మీద కత్తి పెట్టి సంస్కరణలు చేయాలంటే ఎట్ల? ఇది ప్యాకేజీ కాదు” అని సీఎం కేసీఆర్​ ప్రెస్​మీట్​లో అన్నారు.

కంటెయిన్ మెంట్ జోన్లు తప్ప మిగతా చోట్ల లాక్ ఓపెన్

 

Latest Updates