రంగు రబ్బారబ్బా

ప్రతి మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లే సిటీ జనాలు హోలీ పండగ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి తగినట్టుగా ఈవెంట్ ఆర్గనైజర్లు భారీగా ప్రోగ్రాంలను కండక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నా రు. ప్యాకేజ్ ని బట్టి టిక్కెట్ ధరలను నిర్ణయించారు.కొంతమంది ఆర్గనైజర్లు యూత్ ని అట్రాక్ట్ చేసేందుకు, మూవీ టీంలను, సెలబ్రిటీలను ఈవెంట్లకు అతిథులుగా తీసుకొస్తున్నా రు. ఈసారి సిటీలో హోలీ ఈవెంట్స్ ఏయే ప్రాంతాల్లో జరగనున్నా యో, టిక్కెట్ల ధర ఎంతో, ఎవరెవరు వస్తున్నారో తెలుసుకోండి.

దోమల్ గూడ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్

దోమల్ గూడ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్‌‌లో హోలీఫై పేరుతో ఈవెంట్ జరగనుంది. ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.399, చిన్నారులకు రూ.249 లుగా ఉంది. వీటితో పాటు ఫ్రీ ఆర్గానిక్ కలర్స్, స్పెషల్ షేడ్ టెంట్స్, రెయిన్ డ్యాన్స్, పంజాబ్ డోల్, ఫుడ్ స్టాల్స్, ఫన్ గేమ్స్ ని ఉంటాయి. ఈవెంట్‌‌కు ముఖ్య అతిథిగా ర్యాప్ సింగర్ రోల్ రైడా హాజరై తన పాటలతో జోష్ నింపనున్నారు.

నోవాటెల్ శంషాబాద్‌‌ ఎయిర్పోర్ట్

హైదరాబాద్‌ బిగెస్ట్‌‌ బ్యాం గ్ బ్యాం గ్ హోలి ఫెస్ట్  2019 పేరుతో శంషాబాద్ నోవాటెల్ ఎయిర్ పోర్ట్ హోటల్‌‌లో ఈవెంట్ జరగనుంది. ఎంట్రీ ఫీ కపుల్స్ కి రూ. 5,500, ఫిమేల్ స్టాగ్ రూ.3,000, పండేళ్ల లోపు చిన్నారులకు  రూ.1200ల ధరలో టికెట్లు ఉన్నాయి . అన్ లిమిటెడ్ బేవరేజేస్, కిడ్స్ పూల్స్, ఆర్గానిక్ కలర్స్, టాప్ బాలీవుడ్, హిప్ హాప్ మ్యూజిక్, బబుల్స్, బెలూన్ ఫైట్స్ వంటివి ఉంటాయి. ఈవెంట్ లో నటి నేహామాలిక్ సందడి చేయనుంది.

మాదాపూర్ ఎస్ కన్వెన్షన్ రోడ్

మాదాపూర్ లోని ఎస్ కన్వెన్షన్ రోడ్ లో లత్మార్ హోలీ వోల్.2 పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. పాల్గొనాలనుకునే వారికి సింగిల్ ఎంట్రీ రూ.329, కిడ్స్ రూ.149, సింగిల్ పాస్ రూ. 499, కపుల్ పాస్ రూ. 849, గ్రూప్(5మంది)కి రూ. 2,249, గ్రూప్ (10మంది)కి రూ. 3,999 ధరల్లో పాసెస్ ఉన్నాయి . ఇందులో ఓపెన్ ఎరీనా, రెయిన్ స్ప్రింకిల్స్, కలర్ స్మోక్స్, పేపర్ స్ప్రింక్లర్స్, బెలూన్ ఫైట్, పంజాబి డోల్, నాసిక్ డోల్, ఫేస్ పెయింటిం గ్, సెల్ఫీ బూత్, ఫుడ్ స్టాల్స్ అట్రాక్షన్స్ గా నిలవనున్నాయి.

జల విహార్

రిలాక్స్, రిఛార్జ్, రిఫ్రెష్ వితౌట్ కలర్స్ తో నెక్లెస్ రోడ్ జలవిహార్ లో హోలీ వేడుకు లు నిర్వహించనున్నా రు. ఈవెంట్ లో వాటర్ పార్క్ లో లైవ్ డీజే తో హంగామా, రెయిన్ డ్యాన్స్, స్పెషల్ డ్యాన్స్ మాస్టర్, అన్ లిమిటెడ్ వాటర్ రైడ్స్, గేమ్స్ కల్పిస్ తున్నారు. సింగిల్స్ కి రూ. 350 ఛార్జ్ చేస్తున్నా రు. ఎక్కు వ మంది తీసుకుంటే టికెట్ లలో డిస్కౌట్ లు కూడా అందిస్తున్నారు.

నానక్ రాం గూడ రందివ్

రంగ్ బర్సే లెట్ ది కలర్స్ షోవర్ పేరుతో నానక్ రాంగూడ రందివ్‍ లో హోలీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈవెంట్ లో 8 అవర్స్ నాన్ స్టాప్ మ్యూజిక్, రెయిన్‌‌ డ్యాన్స్, డోల్ ధమాకా, ఆర్గానిక్ కలర్స్, ఫుడ్ స్టాల్స్ కల్పిస్ తున్నా రు. సింగిల్స్ కి రూ.499, గ్రూప్ (ముగ్గురు)కి రూ.1,399, గ్రూప్ (5మంది)కి రూ.2,299, గ్రూప్ (10మంది) కి రూ. 4,499 ఎంట్రీ ఫీజుగా ఉంది.

మణికొండ క్రికెట్ గ్రౌండ్స్

రంగ్ హైదరాబాద్ 2కె19 పేరుతో హోలి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈవెంట్ లో రెయిన్‌‌ డ్యాన్స్, వాటర్ బెలూన్స్, ఆర్గానిక్ కలర్స్, అన్ లిమిటెడ్ ఫుడ్, డీజే, లైవ్ బాండ్, పంజాబీ బీట్స్, మడ్ పిట్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ పాస్ రూ.1,299, ఎర్లీ బర్డ్ వీఐపీ పాస్ రూ. 999, స్టాగ్ మేల్ రూ. 499, ఎర్లీ బర్డ్ స్టాగ్ మేల్ వితౌట్ ఫుడ్ రూ.299, ఎర్లీ బర్డ్ స్టాగ్ ఫిమేమ్ వితౌట్ ఫుడ్ రూ.249, స్టాగ్ ఫిమేల్ వితౌట్ ఫుడ్ రూ.399, లుగా ఎంట్రీ ఛార్జెస్ ఉన్నాయి . ఈవెంట్ లో ర్యాప్ సింగర్ రోల్ రైడా సందడి చేస్తారు.