విక్రమ్​ ల్యాండర్ కనిపించిందా?: బ్రాడ్​పిట్

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు ఫోన్ చేసిన బ్రాడ్ పిట్

చంద్రయాన్​ 2 ల్యాండర్​ విక్రమ్​ ఆచూకీ కోసం మన ఇస్రో సహా నాసా కూడా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఫొటోలు తీస్తామని నాసా చెప్పింది. ఇప్పుడు ఆ ఆసక్తి హాలీవుడ్​ హీరో బ్రాడ్​పిట్​కు కూడా కలిగినట్టుంది. ఐఎస్​ఎస్​కు ఫోన్​ చేసి ఆస్ట్రోనాట్​ నిక్​ హేగ్​ను విక్రమ్​ ఆచూకీపై ఆయన ఆరా తీశారు మరి.

‘‘విక్రమ్​ ల్యాండింగ్​ రోజే నేను నాసా జెట్​ ప్రొపల్షన్​ లేబొరేటరీకి వెళ్లాను. అమెరికా కూడా అందుకు సాయం చేస్తోందని తెలుసుకున్నా. కానీ, దురదృష్టవశాత్తూ అది సక్సెస్​ కాలేదు. మరి, ఐఎస్​ఎస్​ నుంచి మీకేమైనా విక్రమ్​ కనిపించిందా? దాని జాడను కనిపెట్టారా?” అని హేగ్స్​ను బ్రాడ్​ పిట్​ అడిగారు. అయితే, తమకేమీ దాని జాడ తెలియలేదని, తామూ అందరిలాగే న్యూస్​ రిపోర్టుల కోసం వేచి చూస్తున్నామని హేగ్​ రిప్లై ఇచ్చారు. బ్రాడ్​ పిట్​ తీసిన ‘యాడ్​ ఆస్ట్రా’ అనే స్పేస్​ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన నాసా నుంచి ఐఎస్​ఎస్​కు ఫోన్​ చేశారు. అందులో భాగంగా హేగ్స్ ను బ్రాడ్​ కొన్ని ప్రశ్నలు అడిగారు.

Latest Updates