మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నేతల నివాళులు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నేతల నివాళులు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్థంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని వీరభూమిలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నివాళులర్పించారు. వీరితో పాటు నేతలు పి.చిదంబరం, సచిన్ పైలట్ కూడా మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించారు.

1984లో తన తల్లి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 1984లో పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన... 40 సంవత్సరాల వయస్సులో ప్రధానమంత్రి పదవి చేపట్టి.. భారతదేశంలోనే అతి పిన్న వయస్సులో పీఎం అయిన వ్యక్తిగా .. చరిత్రకెక్కారు. రాజీవ్ గాంధీ డిసెంబర్ 2, 1989 వరకు భారత ప్రధాన మంత్రిగా పనిచేశాడు. 1944 ఆగస్టు 20న జన్మించిన ఆయన.. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) ఆత్మాహుతి బాంబర్ చేతిలో హత్యకు గురయ్యారు.