మాంజా దారాల్లో చిక్కుకున్న పావురాన్ని కాపాడిన హోమ్ గార్డ్

హైదరాబాద్ : కైట్స్ ఎగరవేస్తుండగా ఓ పావురానికి మాంజాదారం తగలడంతో దారాల్లో చిక్కుకున్న పావురం కిందపడి విలవిల్లాడింది. ఎస్ ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని.. సిద్దార్థ నగర్ లో కిందపడ్డ పావురాన్ని గమనించాడు హోమ్ గార్డ్. వెంటనే పావురం దగ్గరకు చేరుకుని దారంలో చిక్కుకుని కొట్టుకుంటున్న పావురాన్ని పట్టుకున్నాడు. నెమ్మదిగా మాంజాదారాన్ని కట్ చేశాడు. పావురాన్ని ప్రాణాలతో రక్షించిన హామ్ గార్డ్ ..ఆ తర్వాత పావురాన్ని ఆకాశంలోకి ఎగరవేశాడు. మాంజాలో చిక్కుకున్న పావురాన్ని కాపాడిన హోమ్ గార్డ్ రత్నాకర్ ను అభినందించారు సీపీ అంజనీ కుమార్.

Latest Updates