వింగర్ డ్రైవర్ కి ఫీట్స్… హోంగార్డు మృతి

సికింద్రాబాద్: బేగంపేట్ ప్రకాష్ నగర్ లో  టాటా వింగర్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన వాహనం   ముందున్న 10 వాహనాలను ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్ కి హఠాత్తుగా ఫిట్స్ రావడంతో అదుపు తప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బేగంపేట్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ హోంగార్డ్  ప్రభాకర్ మృతి చెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బేగంపేట పోలీసులు వారందరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హోం గార్డ్ ప్రభాకర్ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కు ఫిట్స్ రావడం వలనే వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Latest Updates