బ్రేకింగ్: మళ్లీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనారోగ్య కారణాలతో మరోమారు దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌‌‌లో చేరారు. శనివారం రాత్రి 11 గంటలకు కార్డియో న్యూరో టవర్‌‌‌లో షాను అడ్మిట్ చేశారు. కరోనా ట్రీట్‌‌‌మెంట్ అనంతరం కోలుకున్న షా.. గత నెల 31న ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే రికవరీ అయ్యాక ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్చారని సమాచారం. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆయనను ఆస్పత్రి‌‌లో జాయిన్ చేసినట్లు ఎయిమ్స్‌‌‌ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌‌గా తేలడంతో షా గురుగ్రామ్‌‌లోని మేదాంత ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కరోనా నుంచి కోలుకొని గత నెల 14న హోం ఐసోలేషన్‌‌‌కు వెళ్లిపోయారు. అయితే శరీర నొప్పులు, అలసటగా ఉండటంతో అదే నెల 18న ఎయిమ్స్‌‌‌లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ అనారోగ్య కారణాలతో ఇంకోసారి ఎయిమ్స్‌‌‌లో జాయిన్ అయ్యారు.

Latest Updates