బూత్ లో డబ్బులు పంచుతున్న TRS నాయకుడు,హోంగార్డ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వద్ద  టీఆర్ఎస్ నాయకుడు, హోంగార్డ్  డబ్బులు పంపిణీ చేస్తూ  పట్టుబడటంతో ఉద్రిక్తత నెలకొంది.  చుంచుపల్లి మండలం రుద్రంపూర్ లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు టీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగరేణి గుర్తింపు సంఘం నాయకుడు రాజక్  నుంచి  డబ్బులు తీసుకుని పోలింగ్ బూత్ వద్దకు వచ్చే ఓటర్లకు పంపిణీ చేస్తూ పట్టబడ్డారు.  ఈ విషయంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇండిపెండెంట్ గా పోటిచేస్తున్న వేముల రాజ్యలక్ష్మి ఆరోపించారు. దీంతో డబ్బులు పంచుతున్న హోంగార్డును, టీఆర్ఎస్ నాయకుడు రాజక్ ను అక్కడున్న వారు అడ్డుకుని  చితకబాదారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వచ్చి వారిని వారించారు.

Latest Updates