రాయల్​ ఎన్​ఫీల్డ్​కు పోటీగా హోండా హైనస్ సీబీ350

నవరాత్రి నుంచి అమ్మకానికి
ధర రూ.1.9 లక్షలు

హైదరాబాద్, వెలుగు:  హోండా ‘హైనస్ సీబీ 350’ మార్కెట్‌‌లోకి ఎంటర్‌‌ అయ్యింది.  స్మార్ట్‌‌ఫోన్‌‌ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉన్న ఈ బైక్.. 350సీసీ ఇంజిన్‌‌తో మార్కెట్‌‌లోకి వచ్చింది. దీని ధర ఎక్స్‌‌షోరూంలో రూ.1.9 లక్షలుగా ఉంటుందని హోండా కంపెనీ ప్రతినిధులు చెప్పారు. హోండా హైనన్‌‌ను ప్రత్యేకంగా ఇండియన్ కస్టమర్ల కోసమే కంపెనీ డెవలప్‌‌ చేసింది. ఇండియన్ వేదికగా గ్లోబల్‌‌గా ఈ వెహికల్‌‌ను కంపెనీ విడుదల చేసింది. ఇండియాలో అమ్మిన తర్వాతనే.. ఇతర మార్కెట్లో అమ్మకానికి పెట్టనున్నారు. ఈ మోటార్‌‌‌‌సైకిల్ పండుగ సీజన్ నవరాత్రి  నుంచి అమ్మకానికి వస్తుందని హోండా మోటార్‌‌‌‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యాద్‌‌విందర్ సింగ్ గులేరియా చెప్పారు. ఇవాల్టి నుంచి బైక్‌‌ టచ్ అండ్ ఫీల్‌‌ కోసం గూర్గావ్, ముంబై, బెంగళూరు, కొచ్చి, బిలాయ్‌‌లోని హోండా బిగ్ వింగ్ డీలర్‌‌‌‌షిప్‌‌లలో అందుబాటులో ఉంచనున్నామని చెప్పారు. హైనస్ సీబీ350 బుకింగ్స్‌‌ను కంపెనీ ప్రారంభించిందని తెలిపారు.

టోకెన్ అమౌంట్ రూ.5 వేలు కట్టి ఈ బైక్‌‌ను బుక్ చేసుకోవచ్చు. డీలక్స్, డీలక్స్ ప్రొ అనే రెండు వేరియంట్లలో హైనస్ సీబీ350 అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మిడ్‌‌ సైజు మార్కెట్‌‌ను టార్గెట్‌‌గా చేసుకుని ఈ బైక్‌‌ను తెచ్చింది. ఈ బైక్‌‌ను కంపెనీ మానేసర్‌‌‌‌ ప్లాంట్‌లో తయారు చేసినట్టు హోండా తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి హోండా 50 బిగ్‌‌ వింగ్ షోరూంలను తెరవాలని  లక్ష్యంగా పెట్టుకుంది.  ఇండియాలో తమ నెట్‌‌వర్క్‌‌ను విస్తరిస్తున్నట్టు హోండా తెలిపింది. హోండా హైనస్ అడ్వాన్స్డ్‌ టెక్నాలజీతో రూపొందింది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. రౌండ్ ఎల్‌‌ఈడీ హెడ్‌‌ ల్యాంప్, టాల్ హ్యాండిల్ బార్స్, స్ప్లిట్ సీట్, అలాయ్ వీల్స్, క్రోమ్ మిర్రర్స్ ఉన్నాయి. హోండా డీలక్స్ ప్రొ వేరియంట్‌‌లో ఉండే స్మార్ట్‌‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్‌‌తో రైడర్స్ తమ స్మార్ట్‌‌ఫోన్‌‌ను బ్లూటూత్‌‌తో బైక్‌‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. హోండా హైనస్ సీబీ350 మిడ్‌‌వెయిట్ కేటగిరీ(350–500సీసీ)లో ఉన్న రాయల్ ఎన్‌‌ఫీల్డ్‌‌ బైక్‌‌లకు పోటీ ఇవ్వనుంది.

Latest Updates