ఆక్టివా 6జీ మోడల్స్ లో ప్రాబ్లమ్..కస్టమర్లకు రీకాల్

న్యూఢిల్లీ: వెనుక కుషన్‌‌లో సమస్య ఉండటం వల్ల డయో, ఆక్టివా 125, 6జీ మోడల్స్‌‌లో కొన్నింటిని కస్టమర్ల నుంచి వెనక్కి తెప్పిస్తున్నామని హోండా మోటార్‌‌సైకిల్‌‌ అండ్‌‌ స్కూటర్ ఇండియా (హెచ్‌‌ఎంఎస్‌‌ఐ) శనివారం  తెలిపింది. కుషన్‌‌ను ఉచితంగా రిపేర్‌‌ చేశాక తిరిగి వాటిని యజమానులకు అప్పగిస్తామని కంపెనీ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు అన్నారు. అయితే గత నెల 14 నుంచి 20 తేదీల మధ్య తయారైన స్కూటరెట్లలో మాత్రమే ఈ సమస్య ఉందని హెచ్‌‌ఎంఎస్‌‌ఐ ప్రకటన తెలిపింది. కుషన్‌‌లో నాణ్యత లేకపోవడంతో బండికి ఆయిల్‌‌ లీక్‌‌, బ్రేకేజ్‌‌, ఇంబాలెన్స్‌‌ వంటి సమస్యలు రావొచ్చని తెలిపింది.

Latest Updates