వివాదాస్పద బిల్లుపై వెనక్కి తగ్గని హాంకాంగ్

హాంకాంగ్: నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని చైనాకు అప్పగించేందుకు సంబంధించిన కాంట్రవర్షియల్​ బిల్లుపై హాంకాంగ్​ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆదివారం రికార్డు స్థాయిలో పది లక్షల మంది నిరసనకు దిగారు. 1997లో హాంకాంగ్​ను బ్రిటన్​ చైనాకు అప్పగించిన తర్వాత చేపట్టిన మిలియన్​ మార్చ్​ చేపట్టారు. ఇప్పుడు దానికి మించి ప్రజలు ఈ మార్చ్​లో పాల్గొన్నారు. ఈ బిల్లుతో హాంకాంగ్​ స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని, వెంటనే దానిని విత్​డ్రా చేసుకోవాలని డిమాండ్​ చేశారు. ఒకవైపు ఆందోళన చెలరేగుతున్నా.. ప్రో-బీజింగ్​ లీడర్లు మాత్రం బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. హాంకాంగ్​లోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా కట్టడి చేసేందుకే ఈ బిల్లును తెస్తున్నామంటున్నారు. ఈ బిల్లును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, దీనిపై బుధవారం పార్లమెంట్​లో యథావిధిగా చర్చ కొనసాగుతుందని హాంకాంగ్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ క్యారీ లామ్​ సోమవారం స్పష్టం చేశారు. లామ్ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం పార్లమెంట్​ దగ్గర ర్యాలీకి, ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

Latest Updates