హానర్‌‌ 9X ఆగయా

చైనా స్మార్‌‌ఫోన్ కంపెనీ హువాయి సబ్‌‌-బ్రాండ్‌‌ హానర్.. ఇండియా మార్కెట్లోకి 9X స్మార్ట్‌‌ఫోన్‌‌ను మంగళవారం లాంచ్​ చేసింది. 48 ఎంపీ ట్రిపుల్‌‌ కెమెరా, 16 ఎంపీ పాపప్‌‌ సెల్ఫీ కెమెరా దీని ప్రత్యేకతలు. 4జీబీ + 128జీబీ ధర  రూ. 13,999లు కాగా,  6జీబీ + 128జీబీ వెర్షన్‌‌ ధర రూ. 16,999. ఈ నెల 19 నుంచి ఫ్లిప్‌‌కార్ట్‌‌లో దీనిని ఆర్డర్‌‌ చేయవచ్చు. తొలిరోజు 4జీబీ వెర్షన్‌‌ను కొంటే రూ.వెయ్యి డిస్కౌంట్‌‌ ఇస్తారు. ఈ ఫోన్‌‌లో 6.59 ఇంచుల స్క్రీన్‌‌, కిరిన్‌‌ 710ఎఫ్‌‌ ప్రాసెసర్‌‌, 4,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Latest Updates