సిరిసిల్ల జిల్లాలో దారుణం.. మ‌రో ప‌రువు హ‌త్య‌

తెలంగాణలో మ‌రో పరువు హత్య కలకలం రేపుతుంది. మిర్యాలగూడ ప్రణయ్.. హైదరాబాద్ హేమంత్ .. తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో మ‌రో ఘోరం జరిగింది. కూతురు తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందనే అక్కసుతో అబ్బాయి తండ్రిని అమ్మాయి బంధువులు దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని బోయిన్‌పల్లి మండలం స్తంభంపల్లిలో ఈ దారుణం జ‌రిగింది. గ్రామానికి చెందిన గౌతమి- మహేశ్ అనే ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది. ఇది తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు మహేశ్ ఇంటిపై దాడి చేశారు. ఆగ్రహంతో ఊగిపోతూ అబ్బాయి తండ్రిని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన అతను మరణించాడు. గౌతమి- మహేశ్‌లు దసరా రోజున పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అదే రోజున అబ్బాయి తండ్రి లక్ష్మినారాయణని గౌతమి కుటుంబసభ్యులు కొట్టారు.తీవ్రంగా గాయపడిన పెద్దాయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో నాలుగు రోజు చికిత్స పొందిన లక్ష్మినారాయణ శుక్ర‌వారం పరిస్థితి విషమించి చనిపోయాడు. గౌతమి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని మహేశ్ కుటుంబ సభ్యులు కోరతున్నారు.

Latest Updates