సుశాంత్ కేసులో త్వరలో సొర చేపలు పట్టుబడతాయి

రియా చక్రవర్తి సోదరుడి అరెస్టుపై శేఖర్ సుమన్ కామెంట్స్

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ లింకున్నాయని తెలియడంతో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఈ విషయంపై హిందీ నటుడు శేఖర్ సుమన్ స్పందించారు. ‘గెలుపు దిశగా ఇది తొలి అడుగు. అందరికీ కంగ్రాట్స్. చిన్న చేప దొరికింది. ఇప్పుడు సొర చేపలు దొరకాల్సి ఉంది. త్వరలోనే అవి కూడా దొరుకుతాయని ఆశిస్తున్నా. పరిశ్రమ శుభ్రమవుతోంది’ అంటూ శేఖర్ సుమన్ ట్వీట్ చేశారు. సుశాంత్ మృతి తర్వాత అతడి పాట్నాలో ఉన్న అతడి కుటుంబీకులను శేఖర్ కలిశారు.

Latest Updates