లాక్ డౌన్ క‌ష్టాల‌కు ప‌క్కాప్లాన్ తో చెక్ పెట్టాలి: సోనియా

న్యూఢిల్లీ: లాక్ డౌన్ తో నెలకొన్న తాజా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ఎదుర్కొంటుందని భావిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ చెప్పారు. శుక్రవారం కాంగ్రెస్ స్టేట్ యూనిట్ చీఫ్ లతో సోనియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాపై దేశం సాగిస్తున్న పోరులో భాగస్వామ్యం కావడానికి పార్టీ సిద్ధంగా ఉందని సోనియా చెప్పారు. ‘ఈ విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలు సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. లాక్ డౌన్ తో గ్రామాలకు తరలిన నిరుపేద కూలీలను కాంగ్రెస్ కార్యకర్తలు ఆదుకుంటున్నారు. లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందలు పడుతున్న పేదలు, రైతులు, వర్కర్లను ఆదుకోవడానికి సర్కార్​ సరైన ప్లానింగ్​తో ముందుకొస్తుందని అనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఎకానిమీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోనుంది . అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి’ అని పార్టీ రాష్ట్రాల ప్రెసిడెంట్లకు సోనియా వివరించారు.

Latest Updates