ఎండ తీవ్రతకు ఆటో ఎక్కిన గుర్రాలు

ఎండ తీవ్రతకు జనాలు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 9గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మండతున్న ఎండలకు.. జంతువులు కూడా హడలెత్తిపోతున్నాయి. ప్రతీ సమ్మర్.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గుర్రపు బగ్గీలను హైదరాబాద్ లో జరిగే పెళ్లి బరాత్ లలో వాడతారు. ఇందులో భాగంగా.. పెళ్లి కొడుకును ఎదురుకోవడానికి, బరాత్ కు గుర్రపు బగ్గీని బుక్ చేసుకున్నారు ఓ పెళ్లి వారు. దీంతో పెళ్లి మండపానికి గుర్రాలను, బగ్గీని తరలించే క్రమంలో ఆటోను వాడారు ఆ గుర్రాల యజమాని. ఎండలు మండుతున్నందున గుర్రాలను రోడ్డుపై నడిపించడం ఇష్టం లేకే ఇలా ఆటోలో తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

 

Latest Updates