కారులో ఇరుక్కుపోయిన గుర్రం

హైవే మీద ఓ కారు దూసుకుపోతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో, ఎట్లొచ్చిందోగానీ సడన్​గా రోడ్డుపైకి వచ్చింది ఓ గుర్రం. ఆ గుర్రాన్ని చూసి కారు డ్రైవర్​ బ్రేకేశాడు. కానీ, కంట్రోల్​ కాలేదు. గుర్రాన్ని ఢీకొట్టేసింది. ఆ ఫోర్స్​కు కారు  ముందు అద్దం పగిలి ఆ గుర్రం ముందు రెండు కాళ్లు, మొహం కారులో ఇరుక్కుపోయాయి. అప్పటికే పగిలిన అద్దం ముక్కల వల్ల గుర్రానికి గాయాలయ్యాయి. ముందు డోరు విండో నుంచి తల బయటకు పెట్టి బయటపడే ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో అధికారులు వచ్చి ఆ కారు టాప్​ను కోసేసి గుర్రాన్ని బయటకు తీశారు. అదృష్టవశాత్తూ కారు డ్రైవర్​కు ఏం కాలేదు. గుర్రానికే అద్దం ముక్కలు కోసుకుపోయాయి. ఆ గుర్రం పేరు రాంచెరో. ఆ గుర్రం ఓనర్​ మాషితో స్వింగ్​.ఈ ఘటన పోర్టోరికోలోని గ్వేడనోలో జరిగింది. తన గుర్రం వల్ల కారు మొత్తం పాడైపోవడంతో ఆ కారు ఓనర్​కు డబ్బులు ఇచ్చాడు మాషితో. అయితే, తన గుర్రం ట్రీట్​మెంట్​కు డబ్బులు లేకపోవడంతో క్రౌడ్​ఫండింగ్​ కోసం రిక్వెస్ట్​ పెట్టాడు. దీంతో చాలా మంది నెటిజన్లు ఆ గుర్రం బాధ చూసి డబ్బులు పోగేసి ఇస్తున్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates