ఆర్టిస్టుల కోసం హాస్టల్

సినిమా, పెయింటింగ్ కళాకారులు ఎక్కువగా గోవా టూర్ కు వెళ్తుంటారు. కారణం.. అక్కడి ప్రశాంత వాతావరణంలో రిలాక్స్ అయ్యి, కొత్త ఆలోచనలతో తిరిగి రావొచ్చని. అయితే అక్కడి హోటళ్లు, రిసార్టుల్లో ప్రశాంతంగా పాట పాడుకునే అవకాశం ఉండదు. ఈక్రమంలో ప్రశాంతత కోసం గోవా వచ్చే కళాకారుల కోసం ‘ఇమాజినేషన్’ అనే హాస్టల్ ఉంది. ఇక్కడ నచ్చినన్ని రోజులు ఉండటమే కాదు.. ఆడిపాడుతూ, చిందులు వేయొచ్చు. కేవలం కళాకారుల కోసమే ఈ హాస్టల్. దీని ఫౌండర్స్ పరీన్, మన్సీ. ముంబైకి చెందిన వీరిద్దరూ మొదట విలాసవంతమైన హోటల్‌ నిర్మించారు. దానికి మంచి పేరు రావడంతో లాభాలకు అమ్ముకున్నారు. ఆ డబ్బులతో కళాకారుల కోసం ‘ఇమాజినేషన్’ అనే హాస్టల్ ని నిర్మించారు. ముంబైకి చెందిన వాళ్ల రైటర్ మిత్రుడు.. గోవాలోని హోటళ్లలో నెల రోజుల పాటు ఉండేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించేవాడు. ఎవరైనా హాస్టల్ లాంటిది ఏర్పాటు చే స్తే బాగుంటుందని వాళ్లతో చెప్పాడు. దీంతో హాస్టల్ నిర్మాణం మొదలైంది. మొదట్లో ఎనిమిది మందితో మొదలైన ఈ హాస్టల్లో ప్రస్తుతం చాలా మంది కళాకారులున్నారు. వాళ్లకు కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉంటాయి. ఆర్టిస్టుల కోసమే వాయిద్య పరికరాలు కొనుగోలు చేసి ఈ హాస్టల్ లో ఉంచారు.

Latest Updates