హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటున్నారా.. ఈ వార్త మీకోసమే

hostels-in-hyderabad-are-not-following-rules-271224-2

సిటీలో హాస్టళ్లు మంచిగ లేవు!

హైదరాబాద్, వెలుగు: సిటీలో ప్రైవేట్ హాస్టళ్ల దందా జోరుగా సాగుతోంది. విద్య, ఉపాధి కోసం నగరానికి వచ్చేవారు వీటినే ఆశ్రయిస్తారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే నడుపుతున్న ఈ హాస్టల్స్​లో ఇరుకు గదుల్లో విద్యార్థులను పెట్టి నిర్వాహకులు డబ్బులు దండుకుంటున్నారు. నగరంలో కనీసం 6వేలకు పైగా ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నా, వాటిలో సరైన సౌకర్యాలు అందించేవి వందల్లోనే ఉన్నాయి. ఏరియా, వసతులను బట్టి ఒక్కో హాస్టల్ ప్రతి ఒక్కరికి కనీసం రూ. 3 వేల నుంచి రూ. 10వేల వరకు వసూలు చేస్తుండగా, ప్రధానంగా వెస్ట్ జోన్ పరిధిలోని హైటెక్ సిటీ, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలతోపాటు, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, వెంగళ్రావు నగర్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట, మెహిదీపట్నం, కాచిగూడ, సికింద్రాబాద్, అత్తాపూర్, ఉప్పల్, గాంధీ నగర్, విద్యానగర్, హిమాయత్ నగర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. విద్యాసంస్థలు, కోచింగ్‌‌ సెంటర్లు, కంప్యూటర్‌‌ ఇన్​స్టిట్యూట్ లు, సాఫ్ట్‌‌వేర్‌‌ సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హాస్టళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చదువు, ఉద్యోగ ఉపాధి మార్గాలకు వెతుకుంటూ నగరానికి వచ్చేవారికి ఇవే ప్రధాన షెల్టర్​గా ఉంటున్నాయి.

రూల్స్​ఏం చెప్తున్నాయంటే…

ఒక హాస్టల్‌‌ ఏర్పాటు చేయాలంటే విశాలమైన బిల్డింగ్‌‌తోపాటు ఫైర్‌‌ సేఫ్టీ, సెక్యూరిటీ వ్యవస్థ వంటివి ముఖ్యమైనవి ఉండాలి. కానీ ఇవేమీ లేకుండానే, కనీసం బిల్డింగ్‌‌ చూడకుండానే అధికారులు కాసులకు కక్కుర్తి పడి హాస్టళ్ల ఏర్పాటుకు అనుమతులిస్తున్నారు. వీటిని ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉన్నా.. అవేవి పట్టనట్లుగా, బహిరంగంగానే వందలాది హాస్టళ్లు నిత్యం సిటీలో నడుస్తున్నాయి.

అధికారుల తనిఖీలు లేవ్​

సిటీలో ఏ చిన్న వ్యాపారం చేనినా జీహెచ్ఎంసీ పరిధిలో అనుమతులు తీసుకోవాలి. వీటితోపాటు భవనాలు, బిల్డింగులు కేంద్రంగా కార్యాకలాపాలు కొనసాగించే ఏ సంస్థనైనా ఖచ్చితంగా ఫైర్ సేప్టీ ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. చదరపు మీటర్ లోనే నలుగురిని ఉంచుతూ వేలల్లో వసూలు చేస్తున్నాయే తప్పా… మెరుగైన వసతులతో కూడిన హాస్టళ్లు కనిపించవు. వీటిని నిత్యం జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేసి, చర్యలు తీసుకోవాల్సిన ఉన్న, చూసిచూడనట్లుగా వ్యవహారించడం, సిబ్బంది చేతివాటంతో ఎలాంటి అనుమతులు లేకుండానే జీరో దందానే చేస్తుంటాయి.

లేడీస్​హాస్టళ్లకు సెక్యూరిటీ లేదు

సిటీకి వచ్చే వారిలో ఇటీవల కాలంలో ఉమెన్స్, గర్ల్స్ ఎక్కువే ఉంటారు. వీరికోసం ఎక్స్ క్లూజివ్ పేరుతో హాస్టళ్లను ఏర్పాటు చేస్తారే తప్పా…  అక్కడ ఉండేవారికి ఏదీ ఎక్స్ క్లూజివ్ గా ఉండదు. హాస్టళ్ల ముందు సీసీ కెమెరాలు ఉండాలని పోలీసులు చెప్తున్న పెట్టరు.

హాస్టల్ ​ఫుడ్​ పై నిఘా లేదు

ఆహార సంబంధిత వ్యాపారాలపై నిఘా పెట్టేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో ఆహార తనిఖీల విభాగం పర్యవేక్షిస్తుంది. ఇది కేవలం హోటళ్లలోని ఫుడ్​మాత్రమే పట్టించుకుంటుంది. కాని హాస్టల్​లో తనిఖీలు చేయడం లేదు. ఇప్పటికైనా ప్రైవేట్ హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఆహారంలో నాణ్యత లేదు

ఎల్.ఎల్.బీ చేస్తూ గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నా… కోచింగ్ ఇన్​స్టిట్యూట్​దగ్గరగా ఉందని హాస్టల్ లో ఉంటున్నా. అయితే ప్రతి నెల రూ. 5వేలు హాస్టల్ కోసమే ఖర్చు చేస్తున్నా. రోజురోజుకు ఆహారంలో నాణ్యత తగ్గుతుంది. -మొహీన్ పటేల్

నిర్వహణ ఎక్కువైపోయింది

వాస్తవానికి నిర్వహణ ఎక్కువైపోవడంతోనే ఆహారపదార్థాల్లో నాణ్యత లోపిస్తోంది. విద్యార్థులు ఇచ్చే డబ్బులలో అన్ని ఖర్చులు పోను మిగిలిదే తక్కువే. వాటితో సకల సౌకర్యాలు కల్పించాలంటే కుదరదు. వంద తగ్గితే పక్క హాస్టల్ పోతుంటారు. ఈ టైంలో తక్కువ ఖర్చులోనే నిర్వహణ జరిగిపోయేలా చర్యలు తీసుకుంటాం. -రాజలింగం, హాస్టల్ నిర్వాహకుడు

Latest Updates