బీజేపీ నేతలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాదులోని బీజేపీ నేతల ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ప్రజలపై ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ బిల్లుల భారం మోపడంపై బీజేపీ రాష్ట్ర కమిటి నిరసన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల ఎదుట ధర్నా చేయాలని పిలుపునిచ్చింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి గొడవలు జరకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఆ పార్టీ నేతలను  హౌస్ అరెస్టు చేశారు.

ఎమ్మెల్సీ రాం చందర్ రావు ను హైదరాబాద్ తార్నాకలోని తన ఇంట్లో హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. ముషీరాబాద్ అశోక్ నగర్ లో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఇంటి దగ్గర పోలీస్ లు మోహరించారు.

Latest Updates